90 నిమిషాల్లోనే హోమ్ డెలివరీ!

‘ఫ్లిప్‌కార్ట్ క్విక్’ పేరుతో సరికొత్త సర్వీస్ లాంఛ్ చేసింది. కస్టమర్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన 90 నిమిషాల్లో హోమ్ డెలివరీ చేస్తామంటోంది ఫ్లిప్‌కార్ట్. స్థానికంగా ఫ్లిప్‌కార్ట్ హబ్స్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ని మీరు ఆర్డర్ చేస్తే 90 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాయి. కస్టమర్లు 90 నిముషాలు లేక 2 గంటల స్లాట్ ను ఎంచుకోవచ్చు. కస్టమర్లు ఆర్డర్ చేసిన తరువాత దగ్గరలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ హబ్ లో ఆర్డర్ ప్లేస్ అవుతుంది. మీకు దగ్గరలో ఉన్న ఫ్లిప్‌కార్ట్ హబ్ ను గుర్తించేందుకు లొకేషన్ మ్యాపింగ్ కోసం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించనుంది. బెంగళూరులో ప్రారంభమైన ‘ఫ్లిప్‌కార్ట్ క్విక్’ సర్వీస్ త్వరలో మిగతా నగరాల్లో కూడా ప్రారంభం కానుంది.