Globaled : విదేశీ విద్య కోసం … గ్లోబల్ ఎడ్ రుణం

ఆక్సిలో ఫిన్‌సర్వ్ విదేశాల్లో ఉన్నత విద్య కలలతో ఉన్న విద్యార్థుల (Students) కోసం గ్లోబల్ ఎడ్ (Globaled) అనే సమగ్ర విద్యా రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ట్యూషన్ ఫీజు, ప్రయాణం, వసతి, ల్యాప్‌టాప్ (Laptop), జీవన వ్యయాలు సహా మొత్తం ఖర్చును కవర్ చేస్తుంది. కేవలం మూడు రోజుల్లో లోన్ మంజూరుతో పాటు లగేజీ, ఎయిర్ టికెట్ (Air ticket) , ఇంటర్నేషనల్ సిమ్, పోస్ట్` ల్యాండిరగ్, సపోర్ట్ వంటి సేవలకు మద్దతు లభిస్తుంది. టాప్ గమ్యస్థానాలైన అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు 25 దేశాల్లో సేవలు విస్తరించాయి. తనఖా అవసరం లేకుండా రుణాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 15,000కి పైగా విద్యార్థులకు రుణాలందించిన ఆక్సికో, గ్లోబల్ ఎడ్ ద్వారా విద్యార్థులకు ఒత్తిడి లేని, సులభమైన విదేశీ విద్యా ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు పూర్తి మనశాంతిని కలిగించేలా రూపొందించబడిరది.