Minister Anam: జీతాలు, భత్యాలు కావాలి కానీ .. అసెంబ్లీకొచ్చి ప్రజాసమస్యలు చర్చించరా?
మీ పార్టీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేయడానికి సిగ్గనిపించడం లేదా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ను(YS Jagan) దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభకొచ్చి ప్రజా ససమ్యలు చర్చించరు కానీ, వారి పన్నుల ద్వారా వచ్చే జీతాలు, భత్యాలు మాత్రం తీసుకుంటారా అని నిలదీశారు. నిజంగా మీకు ప్రజామద్దతు ఉందని భావిస్తే 11 మంది ఎమ్మెల్యేలు (MLAs) రాజీనామా చేసి, ఎన్నికలకు రావాలంటూ జగన్కు సవాలు విసిరారు. అబద్ధాలు, నేర ఆలోచనలతో జగన్ రాజకీ మనుగడ సాగించాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమని దుయ్యబట్టారు. నోట్లో వేలుపెడితే కొరకలేనంత మృదువుగా, పాలు తాగే పసి పిల్లాడిలా జగన్ నటిస్తున్నారు. ఆయన కర్కశత్వాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. వైసీపీ (YCP) ఐదేళ్ల పాలనలో డ్రగ్స్,గంజాయిని పెంచి పోషించారు. యువతను మత్తుకు బానిసలుగా చేశారు అని ఆరోపించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






