అన్నమయ్యపురంలో తాళ్ళపాక వారి నాట్య “కళారాధన”

అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చనలో నృత్య సేవను సభక్తిపూర్వంగా అందించారు.
నృత్యార్చనలో భాగంగా విశాఖపట్నం ప్రాంతం నుండి *కళారాధన మ్యూజిక్ & డాన్స్ అకాడమీ* గురువులు *శ్రీ తాళ్ళపాక సందీప్ కుమార్, శ్రీమతి తాళ్ళపాక శైలజ* గారు, వారి శిష్యులు "శ్రీమతి కే. తరంగిణి, యశశ్రీ, శ్రీవల్లి, చైత్ర, సి. రిశిత, గగన, గమ్య, కే. ఆద్య రెడ్డి, డి. ఇషా ప్రియల్, డి. శ్రీనిక, దీప్తి శ్రీ, పి. శరణ్య, కే. రూషిత, దివ్యవాణి సిశెట్టి, ఏ.వి.వి షణ్ముఖ ప్రియ, పి. అక్షయ, టి. సాహితి, రిగ్వేదితా, పి. అక్షర" సంయుక్తంగా "మీనాక్షి పంచరత్నం, గురుస్తుతి, గురు అష్టకం, చిదంబర స్తోత్రం, చక్కని తల్లి, అదివో అల్లదిహో, లలిత హారతి, బాల గోపాల తారంగం, మహేశ్వరి మహాకాళి, డోలాయాంచల, మధురాష్టకం, నరసింహ కౌత్వం" అనే కీర్తనలకు నృత్యాభినయం అందించారు.
అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ గారు, సంస్థ చైర్మన్ పి. పి. రాజ్ గారు ఙ్ఞాపికను అందించారు. చివరిగా, శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగాయి.