అన్నమయ్య పురంలో అలరించిన శివరంజని శిష్యుల స్వరార్చన

అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి ఈ శనివారం మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం అన్నమ స్వరార్చన సభక్తిపూర్వంగా అందించారు. స్వరార్చనలో భాగంగా నుండి శ్రీ శృతిలయ మ్యూజిక్ అకాడమీ గురువు శ్రీమతి శివరంజని గారు, వారి శిష్యులు "సాయి ప్రణవి, చష్మిక షణ్ముఖి సాయి శ్రీ. కే, మోక్షద నాగదండి దివిజ. ఏ, సుజాత. వి., హర్షిణి, హారిక సిహెచ్., ఎన్. సి. తరంగిణి, సి. అశ్విత, శ్రీ కేసరి, ఓం కేసరి, శ్రీ ప్రాఖ్య. బి., జాహ్నవి. ఎస్, వైష్ణో రోషిని. బి., సహస్ర మునుగంటి, శ్రీనిక. పి., శ్రీకాశ్వి. జి., వెంకట శివ రామ ప్రసాద్, నాగరాజ రావు, మాన్విక్ శౌర్య. వి, సంతోషి చైతన్య కుమారి. వై, సాయి చరణ్. ఎన్., నవ్యశ్రీ సి., పి. భారత్, బి.ఎస్. సత్యదేవ్, అరవ్. బి, అభయ్ శ్రీ వత్సవ్, అథర్వ, అఖిల్, అన్విత, అపర్ణ దువ్వూరి, దీక్షిత, గాయత్రి. ఎం, విశిష్ట. పి, వేదాన్ష్ ఆర్యన్. ఎన్, శౌర్య ప్రతాప్ బి.ఎం.వి., కౌశల్ దత్త్ పటేల్, కిరీటి బుట్టి, మేధ" సంయుక్తంగా "వక్రతుండ మహాకాయ, జయ గణనాయక (వీణ: శ్రీ ప్రాఖ్య) నారాయణతే నమో నమో, బ్రహ్మమొక్కటే, గోవింద గోవింద యని కొలువరే, నిగమా నిగమాంతవర్ణిత, గరుడ గమన తవ, శరణు శరణు, పలుకే బంగారమాయెనా, అంబే అంబికే, చక్కని తల్లికి ఛాంగుభళ, వందే హంటెనంతే, అలరులు కురియగ, జగడపు చనువుల జాజర" అనే కీర్తనలకు స్వరసేవ అందించారు.
అనంతరం కళాకారులకు, ముఖ్య అతిథికి అన్నమాచార్య భావనా వాహిని పక్షాన సంస్థ వ్యవస్థాపకులు డా. శోభారాజు గారు, సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నంద కుమార్ గారు ఙ్ఞాపికను అందించారు. చివరిగా, శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులతో, పసందైన ప్రసాద నైవేద్యాలతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.