శ్రీవారికి ఆదికేశవులు నాయుడి మనవరాలు భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య భారీ విరాళం అందించారు. సుమారు రూ.2కోట్ల విలువైన స్వర్ణ వైజంతీ మాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతులమీదుగా అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు టీటీడీ అలంకరించనుంది. శుక్రవారం తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి మరో వైజయంతీమాలను చైతన్య విరాళంగా అందజేయనున్నారు