జోయెటిస్ రాకతో లైఫ్‌సైన్సెస్ రంగంలో .. కొత్త మైలురాయి : మంత్రి శ్రీధర్‌బాబు

ప్రతిభావంతులకు కేంద్రంగా హైదరాబాద్ నగరం నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాయదుర్గం హైదరాబాద్ నాలెడ్జ్‌సిటీలోని ఓ ఐటీ భవనంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంరక్షణ సంస్థ జోయెటిస్ సంస్థ ప్రపంచ సామర్థ్య కేంద్రం (జీసీసీ`గ్లోబల్ కేపబులిటీ సెంటర్)ను మంత్రి ముఖ్య తిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తాను, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అమెరికా పర్యటనలో ఆ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి చర్చలు జరిపామన్నారు. అతి తక్కువ సమయంలోనే యాజమాన్యం ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. జోయెటిస్ రాకతో లైఫ్‌సైన్సెర్ రంగంలో నగరం కొత్త మైలురాయిని అందుకున్నట్లయిందని చెప్పారు. ప్రపంచంలో పెంపుడు జంతువుల రంగం వృద్ధి 6 శాతం ఉండగా, భారత్‌లో అది 12 శాతం వరకు ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో జోయెటిస్ విస్తరణకు ఇక్కడ అవకాశాలున్నాయన్నారు.