ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు రండి..

ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా దత్ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను అభిమానించే వారందరికీ జనవరి 2025, సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో వైభవంగా జరగనున్న తెలుగు సభలకు ప్రపంచ తెలుగు సమాఖ్య తరపున ఇదే మా ఆహ్వానం అని అన్నారు. 1992లో ప్రారంభించబడిన ప్రపంచ తెలుగు సమాఖ్య ఈ 30 ఏళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసింది. ఇప్పటి వరకు 11 తెలుగు మహాసభలు నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూర్, సింగపూ ర్, దుబాయ్, మలేషియాలో నిర్వహించిన అన్ని సభలు విజయవంతంగా జరిగాయి. 12వ ద్వైపాక్షిక తెలుగు మహాసభలను 2025 జనవరి 3 నుంచి 5వ తేదీల వరకు హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా జరపటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇందిరాదత్ తెలిపారు. ఈ మహాసభల ఏర్పాట్లకోసం 6 వారాలుగా కార్యవర్గ సభ్యులు, అనేక మంది పెద్దలు ముందుకు వచ్చి మహాసభలకు అవస రమైన ఏర్పాట్లలో పాల్గొని సూచనలను, సలహాలను అందజేశారు. మరోవైపు ఈ మహాసభలకు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నాము అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లను, తెలంగాణా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ఇతర రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నట్లు ఇందిరాదత్ వివరించారు. వారందరూ కూడా ఈ మహాసభలకు రావడానికి సుముఖత చూపారు. అదేవిధంగా ప్రముఖ సిని నిర్మాత, నటుడు మురళీమోహన్ మా సమాఖ్యకు ఎంతో మద్దతునిస్తున్నారు. ప్రముఖ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలను కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ విధంగా అన్ని రంగాల నుంచి పెద్దలను, ప్రముఖులను ఆహ్వానిస్తున్నాము అని ఆమె వివరించారు.
ఈ మూడు రోజులు కార్యక్రమానికి అన్ని దేశాలలో ఉన్న తెలుగు ప్రముఖులను, తెలుగు సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రపంచ తెలుగు సమాఖ్యకు దాదాపు 50 దేశాలలో సభ్యులు ఉన్నారు. అందువల్ల అన్నీ దేశాల్లో ఉన్న తెలుగువారితోపాటు, అక్కడ ఉన్న తెలుగు సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నట్లు ఇందిరా దత్ తెలియజేశారు. ఇప్పటికే మాకు అనేక చోట్ల నుంచి చాలామంది ఈ సభలకు రావడానికి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం అందింది. ఈ సభలకు అందరిని రావాల్సిందిగా మరోసారి ఆహ్వానిస్తున్నా ము. తెలుగు టైమ్స్ కూడా ఈ మహాసభల్లో చురుగ్గా పాల్గొంటున్నది. అమెరికాలోని తెలుగువారి పత్రికగా పేరు పొందిన తెలుగు టైమ్స్ ద్వారా కూడా అమెరికాలో ఉన్న విదేశాంధ్రులను ఆహ్వానిస్తున్నాము. ఈ మహాసభల్లో భాగంగా ప్రముఖులను గౌరవించడం, వారిని అవార్డులతో సత్కరించడం వంటివి చేస్తున్నాము. అలాగే సంగీత విభావరి ఉంటుందని ఇందిరాదత్ తెలిపారు. ఈ సభలకు ముందుగా పేర్లను రిజిష్టర్ చేసుకోవలసిన అవసరం ఉందని, అందరూ ముందుగా తమ పేర్లను నమోదు చేసుకొవాలని శ్రీమతి ఇందిర తెలిపారు.
కార్యక్రమ వివరాలు..
ప్రపంచ తెలుగు సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కవిత దత్ మాట్లాడుతూ ఈ మూడు రోజుల కార్య క్రమ వివరాలు అందించారు. ఇంకా అనేక మంది పెద్దలను, ప్రముఖులను కలిసి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటి వరకు తయారయిన వివరాలు ఇసున్నామని శ్రీమతి కవిత తెలిపారు.
3 జనవరి 2025న మహా సభల ప్రారంభం
* సాయంత్రం 3 గంటల నుంచి రిజిస్టర్ చేసుకున్న డెలిగేట్స్ హైదరాబాద్ మాదాపూర్‌లోని నIజజలో సర్వాంగ సుందరంగా అలంకరించిన సభలలోకి వెళతారు.
* సాయంత్రం 4.30కి ప్రారంభోత్సవ కార్యక్రమం తరువాత బిజినెస్ సెమినార్‌లు జరుగుతాయి. ఇందులో జరిగే అనేక కార్యక్రమాలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పెద్దలు పాల్గొంటారు.
* తెలుగు ఏంజెల్స్ అనే కార్యక్రమంలో తెలుగు స్టార్ట్‌అప్ కంపెనీల పరిచయం ఉంటుంది.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి కీ నోట్ అడ్రస్ ఇచ్చే అవకాశం ఉంది.
* 10 మందికి బిజినెస్ అఛీవర్ అవార్డులు ఇవ్వబడతాయి అదేవిధంగా తమ తమ కంపనీల ద్వారా సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి CSR (Corporate Social Responsibility) అవార్డ్స్ ఇవ్వబడతాయి.
4 జనవరి 2025 – రెండవ రోజు
* రెండవ రోజు పూర్తిగా తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో ఉంటుంది.
* తెలుగు పద్య సౌరభాలు, హాస్య వల్లరి ప్రోగ్రాం లు, కూచిపూడి నాట్య ప్రదర్శనలు, తెలుగు జానపద విన్యాసాలు మున్నగు అనేక కార్యక్రమలు ఉంటాయి.
5 జనవరి 2025 – మూడవ రోజు
* మూడవ రోజు ఉదయం తెలంగాణ ఆ జానపద విన్యాసాలు, నాట్య ప్రదర్శనలు, రూపకాలు ఉంటాయి
* మధ్యాహ్నం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం వున్నది.
* బిజినెస్ ప్రముఖులతో పానెల్ డిస్కషన్ కూడా ఉంటుంది.
* అనేక దేశాల నుంచి వచ్చిన తెలుగు సంఘాల అధ్యక్షులను గౌరవించే కార్యక్రమం.
* తెలుగు ప్రజల అభిమాన హీరోలను గౌరవించే కార్యక్రమం కూడా ఉంటుంది
* చివరగా ప్రముఖ గాయకులచే సంగీత విభావరితో కార్యక్రమాలు ముగుస్తాయి.
ఈ వివరాలు ప్రముఖుల రాకను బట్టి మారే అవకాశం ఉందని, అందరు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని శ్రీమతి కవిత తెలిపారు.
మా వెబ్సైట్ www.worldtelugu.com లో ఎప్పటి కప్పుడు అన్ని వివరాలు తెలుకోవచ్చు.