తెలంగాణ ప్రజలు మిమ్మిల్ని పట్టించుకోరు : ఆది శ్రీనివాస్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జైలుకు పోవాల్సి వస్తుందన్న టెన్షన్‌లో ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో చేసిన అక్రమాలు బయటకు వస్తాయన్న భయం ఆయనలో కనిపిస్తోంది. మేం ఏం చేయగలమో రెండు ఎన్నికల్లో చేసి చూపించాం. నాలుగు రోజులు ఓపిక పడితే ఇంకా ఏం చేస్తామో మీకే తెలుస్తుంది. పార్టీ మారిన వారు వ్యభిచారులు అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన వారిని ఏమనాలి? పదేళ్లలో 60 మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకున్న మీ తండ్రికి ఏం పేరు పెట్టాలో మీరే చెప్పండి. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన మిమ్మిలి ఎన్ని రాళ్లతో కొట్టాలి. కేటీఆర్ ఎందుకు ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నావ్. సిరిసిల్లలో అన్ని పార్టీల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నావు. మీరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు మిమ్మిల్ని పట్టించుకోరు అని అన్నారు.