Revanth Reddy: మరోసారి అధికారంలోకి వచ్చేలా పని చేయాలి: రేవంత్ రెడ్డి

రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పార్టీ నేతలకు తెలిపారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డీలిమిటేషన్ (Delimitation), మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికల (Jamili Election) వంటి అనేక అంశాలు రాబోతున్నట్లు తెలిపారు. త్వరలో మార్కెట్ (Market), టెంపుల్ (Temple) కమిటీల్లో నామినేష్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పని చేయాలి. బూత్, గ్రామ, మండలస్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. పార్టీ కమిటీ నాయకులు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పని చేసిన వారికి పదవులు ఇచ్చాం. లక్ష్యాలు నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. నేను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తాయి అని తెలిపారు.