Konda Murali: నన్నెందుకు టార్గెట్ చేస్తారు? : కొండా మురళి

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ విషయం తనకేమీ తెలియదని ఆమె భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) అన్నారు. సిమెంట్ కంపెనీ యాజమాన్యాలను సుమంత్ (Sumanth) బెదిరించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఓఎస్డీ (OSD) బాధ్యతల నుంచి ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇంటి వద్దకు సుమంత్ కోసం పోలీసులు రావడం, మంత్రి కుమార్తె సుస్మిత (Sushmita) అడ్డుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో హనుమకొండలో కొండా మురళి మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ ఫోన్ చూడటం తనకు రాదని, ఏమైందో తెలియదని చెప్పారు. మంత్రి ఛాంబర్‌కు ఇప్పటివరకు తాను వెళ్లలేదన్నారు. నా కుమార్తె, అల్లుడు లండన్‌లో ఉన్నారు. అక్కడ వ్యాపారం చేసుకున్నారు. నా బిడ్డకు పదవి ఏమీ లేదు. ఏ పార్టీలోనూ లేదు. భద్రతా కారణాల వల్ల వేర్వేరు కార్లలో నేను, సురేఖ వెళ్తాం. సీఎం రేవంత్‌రెడ్డి నాకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, ఇస్తారు. సీఎం, మంత్రి పొంగులేటి మా ఇంటికి వచ్చారు, నన్నెందుకు టార్గెట్ చేస్తారు అని అన్నారు.