High Court: గ్రామపంచాయతీ ఎన్నికలపై.. హైకోర్టులో

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) అంశంపై హైకోర్టు (High Court)లో ఎన్నికల కమిషన్ (Election Commission), ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు ముగిశాయి. ఎన్నికల నిర్వహణ కు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా, ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు (Six petitions) దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి.