Vakiti Srihari :ఇది అదృష్టమో… దురదృష్టమో తెలియదు : మంత్రి శ్రీహరి

తనకు కేటాయించిన శాఖలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేళ్లలో ఆగమైన శాఖలను తనకు ఇచ్చారని అన్నారు. ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది అదృష్టమో, దురదృష్టమో తెలియదు. పశుసంవర్ధక శాఖ గందరగోళంగా ఉంది. యువజన సర్వీసులు (Youth Services) ఇస్తే నేనేం చేసుకోవాలి? గొర్రెలు(Sheep), బర్రెలు (goats) ఇస్తే ఏం చేసుకోవాలి అని అన్నారు.
అంతకుముందు కరీంనగర్ (Karimnagar)లో క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్రీడా పాఠశాలల (Schools) అంతర్గత పోటీలు నిర్వహిస్తామని వెల్లడిరచారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. కబడ్డీ, హ్యాండ్ బాల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు.