Uttam Kumar Reddy: బీఆర్‌ఎస్ నిర్మించి ఆ ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయింది : మంత్రి ఉత్తమ్

పెండిరగ్‌లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. నిజామాబాద్ (Nizamabad)లో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం లో ఆయన మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు (Chevella Project) నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగం ఉండేదన్నారు. గత ప్రభుత్వం సాగునీటిపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా, అదనంగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వలేదని విమర్శించారు. నిజాంసాగర్(Nizamsagar), ఎస్సారెస్పీ(SSRSP) ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనేనని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని చెక్ డ్యామ్‌లు మంజూరు చేస్తాం. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి రూ.లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారు. బీఆర్‌ఎస్ నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) మూడేళ్లకే కూలిపోయింది అని విమర్శించారు.