Uttam Kumar Reddy: తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ.. దేశాన్ని అణచివేస్తోందని ఆయన విమర్శించారు. గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత సమావేశంలో ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. “జై భీమ్, జై బాపు, జై సంవిధాన్” వంటి కార్యక్రమాలు ఇప్పుడు అత్యంత అవసరమని ఆయన (Uttam Kumar Reddy) అన్నారు. తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఉత్తమ్ (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. కుటుంబ సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబం సామాజిక న్యాయంపై మాట్లాడడం వింతగా ఉందన్నారు. అలాగే, కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ, ప్రచారం చేసుకోవడంలోనే కొద్దిగా వెనుకబడ్డామని అన్నారు. పార్టీ తీసుకున్న సంక్షేమ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు మరింతగా కృషి చేయాలని ఆయన (Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.