సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం తన నివాసానికి ఆహ్వానించడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.