Kishan Reddy: అందుకే యావత్ ప్రపంచం భారత్ వైపు : కిషన్ రెడ్డి

దేశంలో గత 11 ఏళ్లుగా సుపరిపాలనా సాగుతోందని, అందుకే యావత్ ప్రపంచం భారత్ (India) వైపు చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) చేపట్టిన కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా వివరించాలని, వ్యతిరేక ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని బీజేపీ (BJP) శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణకు కేంద్రం అన్ని రంగాల్లో నిధులిచ్చింద ని తెలిపారు. ఉగ్రవాదుల చేతుల్లో వందలమంది చనిపోతే గతంలో కాంగ్రెస్ స్పందించలేదు. ఉగ్రవాదులు పర్యాటకులను చంపితే ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో దాడులు చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించే పార్టీ బీజేపీ. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (BRS )లు ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోయాయి అని విమర్శించారు.