Mahesh Kumar: కేసీఆరే తెలంగాణకు విలన్‌గా మిగిలిపోతారు : మహేశ్‌కుమార్ గౌడ్

తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాధనం దోచుకుంది కేసీఆరే (KCR )నని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)అన్నారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ కేసీఆర్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. గాంధీభవన్‌లో మీడియాతో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రాజెక్టులు (Projects), భూముల పేరిట దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలుజేశారు. దూరదృష్టి , ఆలోచన లేకుండా ఇబ్బడిముబ్బడిగా అప్పలు తెచ్చారు. పలాయనం చిత్తగించిన వ్యక్తి. కాంగ్రెస్ (Congress) గురించి మాట్లాడుతున్నారు. దొంగ పాస్‌పోర్టులు (Passports) సృష్టించి విదేశాలకు పంపిన చరిత్ర కేసీఆర్‌ది. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చాక ఆయన సీఎం అయ్యారు. తెలంగాణ సాకరం చేసినందుకు కాంగ్రెస్ విలన్‌గా నిలుస్తుందా? కేసీఆర్ తెలంగాణకు విలన్‌గా మిగిలిపోతారు అని అన్నారు.