Mahesh Kumar : పార్టీలో చర్చించకుండా ..అలాంటి ప్రకటనలు చేయొద్దు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి (Ponguleti) ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. క్యాబినెట్ (Cabinet)లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్ అయ్యారు. పార్టీ చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దన్నారు. ఒకరి మంత్రిత్వశాఖ అంశంపై వేరొకరు మాట్లాడటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు (Court) పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మంత్రులు (Ministers) వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలని సున్నిత, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తతగా వ్యవహరించాలని సూచించారు.