Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి బృందం భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో తెలంగాణ జనసమితి (TJS) బృందం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో టీజేఎస్ నేతలు ముఖ్యమంత్రి ని కలిసి ప్రజా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతులకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి తెలంగాణ జనసమితి సూచనలను స్వీకరించడానికి ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ని కలిసిన తెలంగాణ జనసమితి నేతల్లో అర్జున్, బద్రుద్దీన్, శ్రీనివాస్, శంకర్ రావు, రమేష్ ముదిరాజ్, ఆశప్ప, సలీం, వినయ్ తదితరులు ఉన్నారు.