Higher Education: ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో శాన్‌డియాగో వర్సిటీ ప్రతినిధి బృందం భేటీ

విద్యార్థులకు నూతన నైపుణ్యాలను నేర్పేలా అధ్యాపకులకు అదనపు నైపుణ్య శిక్షణను ఇవ్వడంలో భాగంగా భాగస్వామ్య అవకాశాల కోసం శాన్ డియాగో విశ్వవిద్యాలయం (University of San Diego) ( యూఎస్‌డీ) నుంచి వచ్చిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్ణారెడ్డి (Balakrishna Reddy), కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ (Sriram Venkatesh)తో సమావేశమైంది. ఎంఎస్ అఫ్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎస్ అప్లైడ్ డేటా సైంటిస్ట్, ఎంఎస్ సైబర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్, ఎంఎస్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ లీడర్‌షిప్ వంటి మాస్టర్స్ ప్రోగ్రామ్‌లలో అధ్యాపకుల నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ ప్రతినిధి బృందం దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ప్రతిపాదించింది. రాష్ట్రం నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించడానికి నిర్మాణాత్మక అవకాశాలను సృష్టించడంపైనా ఈ సమావేశంలో చర్చించారు.