RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వాయిదా

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా (Strike postponed) పడిరది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తో ఆర్టీసీ జేఏసీ (RTC JAC) నేతలు జరిపిన చర్చలు సఫలం కావడం తో సమ్మె వాయిదా పడిరది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ (IAS) అధికారులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నవీన్ మిత్తల (Naveen Mittala), లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్ (Krishnabhaskar) లతో కూడిన ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు పరిష్కారాలను సూచించనుంది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. డిపోల్లో ఏయే సమస్యలు ఉన్నాయి? ఉద్యోగులు, కార్మికుల పని భారం ఒత్తిళ్లు వంటి అంశాలకు పరిష్కారం ఏమిటనే అంశాలపై జేఏసీ నేతలతో మంత్రి చర్చించారు.