Ponguleti: భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుంది : మంత్రి పొంగులేటి

చట్టం పేద ప్రజలకు చుట్టంలా ఉండాలనే భూభారతి చట్టం రూపొందించామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) షట్‌పల్లిలో నిర్వహించిన భూభారతి (Bhubharati) అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులు చూడలేక మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు దు:ఖం వస్తోందన్నారు. ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 2 వరకు పైలట్ ప్రాజెక్టు మండలాల్లోని భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు మాట వినలేదని కేసీఆర్ రెవెన్యూ వ్యవస్థ (Revenue system)ను రద్దు చేశారని విమర్శించారు. పది రోజుల్లో గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు.