Anganwadi: తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ …త్వరలోనే

తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్ల (Anganwadi helpers )కు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి కోసం గరిష్ఠ వయోపరిమితిని పెంచింది. హెల్పర్‌కు ప్రమోషన్ వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ మహిళా శిశుసంక్షేమశాఖ (Women and Child Welfare Department) నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 4,322 మందికి ప్రయోజనం కలగనుంది. ఈ అంశాన్ని సంబంధించిన దస్త్రంపై మంత్రి సీతక్క(Minister Seethakka) సంతకం చేశారు. దీనిపై త్వరలోనే ఉత్వర్వులు వెలువడనున్నాయి.