Passport : పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో మన పోలీసులు.. దేశంలోనే

పాస్‌పోర్టు (Passport) దరఖాస్తుల పోలీసు ధ్రువీకరణ ప్రక్రియలో తెలంగాణ పోలీసులు (Telangana Police) దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో నిలిచారు. పాస్ పోర్టు దరఖాస్తుల పరిశీలన కోసం రాష్ట్ర పోలీసులు అభివృద్ధి చేసిన వెరీ ఫాస్ట్ యాప్ (Very fast app) ప్రధాన కారణంగా నిలిచింది. రాష్ట్ర పోలీసుల పనితీరును గుర్తించిన కేంద్రం అవార్డు ప్రకటించింది. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహిస్తున్న పాస్‌పోర్టు సేవా దివ్‌స లో విదేశాంగ శాఖ మంత్రి చేతుల మీదుగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి (Shivdhar Reddy )అవార్డు అందుకోనున్నారు. వెరీ ఫాస్ట్ యాప్ పాస్‌పోర్టు దరఖాస్తు ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా నిర్వహించడంలో పోలీసులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. రాష్ట్ర పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్‌పోర్టు దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి చేస్తున్నారు. పోలీస్ వెరిఫికేషన్ తీరుపట్ల 95 పైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు సగటున 2 వేలకుపైగా పాస్‌పోర్టు ధ్రువీకరణలు, వార్షికంగా 8 లక్షలకు పైగా పూర్తి చేస్తున్నారు.