Police:కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో మోసం.. జర భద్రం

కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసు (Telangana Police) శాఖ ప్రకటన జారీ చేసింది. వాట్సప్ (WhatsApp) గ్రూపుల్లో ఫేక్‌లింక్స్ (Fake links) పంపుతున్నారని, కేంద్ర ప్రభుత్వ పథకాలంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఆయా పథకాలకు అర్హత చెక్ చేసుకోవాలని, తొందరపడి ఎవరూ లింక్‌లు క్లిక్ చేయొద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు (Websites) మాత్రమే వాడాలని పోలీసులు తెలిపారు. అపరిచితులు పంపించే లింక్‌లు, మెసేజ్‌లకు స్పందించవద్దని పేర్కొన్నారు.