Tummala : కమిషన్ ముందు ఈటల అబద్ధాలు : మంత్రి తుమ్మల

కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట మాజీ మంత్రి ఈటల (Etela)అబద్ధాలు చెప్పారన్నారు. సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని, మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) కు అనుమతులు ఇచ్చిన తర్వాత కమిషన్ వేశారని చెప్పారు. కాళేశ్వరం విషయంలో మాజీ మంత్రి ఈటల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తమని చెప్పారు. కమిషన్ ముందు ఈటల అబద్దాలు చెప్పాల్సిన అవసరమేంటి?. ఈటల ఆనాలోచితంగా వాంగ్మూలం ఇచ్చారా? అలాంటి పరిస్థితులు వచ్చాయా? తప్పుడు ప్రకటనలతో ఎక్కువ రోజులు మభ్యపెట్టలేరు. కాళేశ్వరం పై సబ్ కమిటీ ఎప్పుడూ నివేదిక ఇవ్వలేదు. వివరాలన్నీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను. నేను సుమోటోగా కమిషన్ ముందుకు వెళ్తాను. ప్రాణాహితపై మాత్రమే స్టేటస్ రిపోర్టు ఇచ్చాం. పెండిరగ్ ప్రాజెక్టలపై మాత్రమే తెలంగాణ ప్రభుత్వం కమిషన్ వేసింది అని అన్నారు.