Tummala : మంత్రి తుమ్మలతో ఝార్ఖండ్ వ్యవసాయ మంత్రి భేటీ

తెలంగాణలోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి తదితరాలను సందర్శించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఝార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి శిల్పి నేహా తిర్కీ (Shilpi Neha Tirkey) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ను మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వ్యవసాయ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల గురించి వారు ఈ సందర్భంగా చర్చించారు. వారి వెంట తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు (Raghunandan Rao), ఉద్యాన సంచాలకురాలు యాస్మిన్ భాషా (Yasmin bhasa) ఉన్నారు.