Supreme Court: సుప్రీంకోర్టులో మెన్షన్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ (BC) లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు (High Court) విధించిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో సవాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు రిజిస్ట్రార్ దగ్గర ప్రభుత్వ న్యాయవాదులు మెన్షన్ వేశారు. గురువారం లేదా శుక్రవారం విచారించాలని విజ్ఞప్తి చేశారు. సీజేఐ అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.