ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు : మంత్రి శ్రీధర్‌బాబు

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కొడంగల్‌లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు కానుంది. ఈ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పన దిశగా సర్కారు ముందడుగు వేసిందని అన్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక ప్రణాళికల వ్యూహాత్మక పెట్టుబడిగా మంత్రి అభివర్ణించారు.