Telangana Congress: కాంగ్రెస్ నేతలూ సర్వదూలానం నోటి దూల ప్రధానం

సాధారణంగా పార్టీ నాయకులు నోరు ఎంత అదుపులో ఉంటే ముఖ్యమంత్రి లేదా ఆ పార్టీ అధినేతలకు లేదంటే ఆ పార్టీ అగ్రనాయకత్వానికి అంత ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది నాయకుల అనవసర పెత్తనం తీసుకొని నోటికి పని చెప్తే మాత్రం కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూకుడు చూస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy)కి భవిష్యత్తు కాలంలో తలనొప్పులు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ (Allu Arjun) వ్యవహారంలో అసలు మాట్లాడవద్దని పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన సరే కొంతమంది నాయకులు మాత్రం నోటికి పని చెబుతున్నారు.
పదే పదే అల్లు అర్జున్ వ్యవహారంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం లేదంటే మీడియాలో హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తాజాగా ఒక ఎమ్మెల్యే అల్లు అర్జున్ ను పగటి వేషగాడు అంటూ మాట్లాడారు. అలాగే సినిమా పరిశ్రమను కించపరిచే విధంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. అటు కొంతమంది ఎమ్మెల్సీలు కూడా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న సమయంలో అనవసరమైన సమస్యలకు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు శ్రీకారం చుడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమా పరిశ్రమ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి అభిమానుల నుంచి ఎన్నికల్లో ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దూకుడు ఉన్న ఆ దూకుడుని కొంతమంది మాత్రమే కొనసాగించాలి.
విమర్శలు వస్తే ఎదుర్కొనే విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. అంతేగాని పగటివేషగాడు అంటూ మాట్లాడటం, సినిమా వాళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం కచ్చితంగా ఇబ్బందికర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గానే ఉన్నారు. అటు పార్టీ అధిష్టానం చెప్పినా లెక్కచేయని నేతల విషయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తోంది.