Telangana : భారత్ పర్వ్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ శకటం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట(Red fort) ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ పర్వ్ (Bharat Parv)లో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ శకటంతోపాటు రాష్ట్ర టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టు (Food courtను రెసిడెంట్ కమిషనర్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్ (Dr. Gaurav Uppal) ప్రారంభించి మాట్లాడారు. రుద్రమ స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సామరస్యంతో పాలన అందిస్తోందన్నారు. ఈ నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ శకటాన్ని ప్రతిఒక్కరూ చూడాలని కోరారు. ఈ సందర్భంగా గిరిజనుల గుస్సాడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.