యూఎన్‌ఓ సమావేశాలకు గార్ల వాసి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ గార్ల మండలం చిన్నబంజర గ్రామానికి చెందిన బంజారా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు తేజావత్ జోగ్రాం నాయక్‌ను ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ గుర్తింపునిచ్చి సమావేశాలకు ఆహ్వానించింది. ఈ మేరకు యూఎన్‌ఏ ఆఫ్రికాలో ఇథోయోపియా లో జరిగే సమావేశాలకు ఆయన హాజరయ్యారు. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్, ఫస్ట్ సేషన్ ఆఫ్ ది ప్రివరేటరీ కమిటీ ఫర్ ది ఫోర్త్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్‌మెంట్ అంశంపై జరిగిన డిబెట్‌లో మాట్లాడారు. జోగ్రాం చిన్ననాటి నుంచి గిరిజన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. బంజారా సేవా సమితి సంస్థను స్థాపించి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు జోగ్రాం నాయక్‌ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.