Miss World Winner :మిసెస్ ఆసియా వరల్డ్ విజేతగా రేవతి

అమెరికాతో పాటు భారత్‌లో 16 ఏళ్లకు పైగా సామాజిక సేవ, మహిళా సాధికారత, ప్రపంచ మానవతా విలువల కోసం కృషి చేస్తున్నందుకు గాను మిసెస్ ఆసియా వరల్డ్ (Miss World Winner) 2025 కిరీటాన్ని నగరానికి చెందిన డాక్టర్ సూర్య రేవతి (Surya Revathi) దక్కించుకున్నారు. ఈ విషయాన్ని మానస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (Manas International Foundation) వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సూర్యారేవతి మెట్టుకూరు తెలిపారు. ఈ నెల 22న దుబాయ్ (Dubai)లో జరిగిన అంతర్జాతీయ కార్యక్రమంలో ఈ అరుదైన గౌరవం దక్కిందన్నారు.ఐటీ, ఫైనాన్స్, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ రంగాలలో సీఈఓగా పనిచేసిన తాను తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఐదు గ్రామాలను దత్తత తీ సుకుని విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా సంక్షేమం,యువత ఉపాధిపై దృష్టి సారిం చి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.