Supreme Court : మాజీ మంత్రి కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు సుప్రీంకోర్టు (Supreme Court ) నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిరదని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ (Suguna ) ఫిర్యాదుతో ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ (Justice Sanjay Karol) ధర్మాసనం పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు (Notices) జారీ చేసింది.