Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy)కి సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. మొయినాబాద్ (Moinabad) వద్ద ప్రైవేటు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్న కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మొయినాబాద్ భూ వ్యవహారంలో గతంలో తెలంగాణ హైకోర్టు (High Court) జీవన్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టేసి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో జీవన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు బెయిల్ మంజూరు చేశారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సిందనని స్పష్టం చేసింది. జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తుది ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించకపోతే విచారణాధికారులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించింది.