High Court :హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి పేర్లను సుప్రీంకోర్టు (Supreme Court ) కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జిల్లా జడ్జిల కోటాలో సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి రేణుక యారా(Renuka Yara), సిటి సివిల్ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు(Narsing Rao), హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇ.తిరుమలాదేవి, హైకోర్టు రిజిస్ట్రార్ ( పరిపాలన), బి.ఆర్.మధుసూదన్ రావులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 11న సిఫారసు చేసింది.