T-Hub: టీ–హబ్‌లో ముగిసిన స్పోర్ట్స్ టెక్ పోడియం 2025
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా, దుబాయ్ స్పోర్ట్స్ సిటీ మరియు జీఎంఆర్ స్పోర్ట్స్ మధ్య భారీ స్థాయి స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్ట్ కోసం ముఖ్యమైన ఒప్పందం కుదరవచ్చని జయేష్ రంజన్ వెల్లడింపు
ఒలింపిక్ మిషన్ 2036 లక్ష్యంగా తెలంగాణ: భారత్ పాల్గొనే ప్రతి విభాగంలో తెలంగాణ అథ్లెట్లు — జయేష్ రంజన్
హైదరాబాద్, డిసెంబర్ 7, 2025: టీ–హబ్‌లో ముగిసిన స్పోర్ట్స్ టెక్ పోడియం 2025. ఒక రోజు పాటు సాగిన ఈ కాన్ఫరెన్స్‌లో స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లు, టెక్ నాయకులు, కార్పొరేట్లు, అథ్లెట్లు, ఫెడరేషన్లు, పాలసీ మేకర్లు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ టెక్ పోడియం కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ప్రముఖ వెంచర్ ఫండ్లు, ఏంజెల్ నెట్వర్క్స్, యూనివర్సిటీలు, జాతీయ ఇన్నోవేషన్ సంస్థలు మద్దతు ఇస్తున్నాయి — దీని ద్వారా హైదరాబాద్ భారతీయ స్పోర్ట్స్ టెక్ & ఇన్నోవేషన్ రాజధానిగా ఎదుగుతోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో Centre Court Capital, LegaXy, Impetus Sports Capital, Hyderabad Angels, TDV Partners, Anthill Ventures, SucSeed Innovation Fund ఉన్నారని స్పోర్ట్స్ టెక్ పోడియం 2025 నిర్వాహకులు ఈ రోజు నగరం లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ఒక ప్యానల్ చర్చలో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. డిసెంబర్ 8–9న జరిగే తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో దుబాయ్ స్పోర్ట్స్ సిటీ మరియు జీఎంఆర్ స్పోర్ట్స్ మధ్య పెద్ద స్థాయి స్పోర్ట్స్ సిటీ కోసం ముఖ్యమైన ఒప్పందం కుదరనుందని ఆయన వెల్లడించారు.
2036 ఒలింపిక్ క్రీడల్లో భారత్ పాల్గొనే ప్రతి క్రీడా విభాగంలో తెలంగాణ అథ్లెట్లు ఉండేలా చేయాలనే ఆత్మవిశ్వాసమైన లక్ష్యాన్ని రాష్ట్రం నిర్దేశించుకున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.
“టెలంగాణా స్పోర్ట్స్ పాలసీ రూపొందించే దశ నుండే మా ఒలింపిక్ లక్ష్యం స్పష్టంగా ఉండేది. ప్రతి క్రీడా విభాగంలో అథ్లెట్లు తయారు చేసి, 2036 ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనే ప్రతి క్రీడలో తెలంగాణ ప్రాతినిధ్యం ఉండడం మా ప్రధాన లక్ష్యం,” అని జయేష్ రంజన్ తెలిపారు.
‘గ్రాస్రూట్స్ టు గ్లోబల్: ఇండియా’స్ స్పోర్ట్స్ టెక్ రైజ్’ అనే చర్చలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, రాష్ట్రం స్పోర్ట్స్ సామర్థ్యాన్ని పునాది స్థాయి నుండే ఎలా అభివృద్ధి చేస్తున్నదో వివరించారు.
“ముఖ్యమంత్రి గారు స్వయంగా క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారుగా తెలంగాణ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌కు విశేష మద్దతు ఇస్తున్నారు. నూతన తరపు క్రీడా ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిదీ పాలసీలో ఉంది,” అని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
ప్రభుత్వం క్రీడలను నేరుగా నిర్వహించే విధానాన్ని క్రమంగా తగ్గిస్తూ, ప్రైవేట్ రంగం పాలుపంచుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. “మేము ప్రత్యేక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం,” అని ప్రకటించారు.
INVE Sports Venture LLP యొక్క 360D Sports, స్పోర్ట్స్, వెల్నెస్, ఫిట్నెస్ రంగాల్లోని స్టార్టప్‌లకు వెంచర్ సపోర్ట్, ఇన్వెస్ట్మెంట్ మార్గాలు, స్కేల్-అప్ వ్యూహాలతో సహయపడే స్పోర్ట్స్ యాక్సిలేటర్ — స్ప్రింట్ఎక్స్ ప్రారంభించినట్టు ప్రకటించింది. దీని లోగోను జయేష్ రంజన్ ఆవిష్కరించారు. దీనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, వుక్సెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఏంజెల్స్ మరియు HNDRD మద్దతు ఇస్తున్నాయి.
హైదరాబాద్‌కి లైఫ్ సైన్సెస్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో ఉన్న బలమైన ఎకోసిస్టమ్ వల్ల ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఇది సహజ ఎంపికగా మారిందని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
గేమ్ పాయింట్ సహ వ్యవస్థాపకుడు & CEO ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ — భారతదేశంలో స్పోర్ట్స్ టెక్ తొలి తరంగం గ్రాస్రూట్స్ స్థాయిలోనే ప్రారంభమైందని, ఇప్పుడు పనితీరు, విశ్లేషణ, ప్రసారాల వంటి లోతైన టెక్నాలజీ స్పోర్ట్స్‌లో సమగ్రంగా చేరుతున్నదని చెప్పారు.
భారత జనాభాలో కేవలం 10% మంది మాత్రమే క్రీడలను అంతంత మాత్రమే ఆడుతారు; కానీ కేవలం 0.01% మాత్రమే సీరియస్ గా పోటీ క్రీడల్లో పాల్గొంటారు. క్రికెట్ మాత్రం 655 మిలియన్ అభిమానులతో అతిపెద్ద క్రీడగానే కొనసాగుతోంది. ప్యానెలిస్టులు రత్నాకర్ సమవేదం (CEO & Managing Partner, Hyderabad Angels) అభిప్రాయం ప్రకారం — క్రీడలలో సీరియస్‌గా పాల్గొనే వారి సంఖ్య కాస్త పెరిగినా కూడా స్పోర్ట్స్ మార్కెట్లో అపార వ్యాపార అవకాశాలు తెరుచుకుంటాయి.
మరో చర్చలో, గ్లోబల్ స్పోర్ట్స్ టెక్ మార్కెట్ ప్రస్తుత USD 19 బిలియన్ నుండి 2030 నాటికి USD 40 బిలియన్కి పెరిగే అవకాశం ఉందని (16% CAGR), ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువని నిపుణులు తెలిపారు.






