Praneetha Rao: ప్రణీత్‌రావును మరోసారి విచారించిన సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు (Praneetha Rao) ను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ (Jubilee Hills Police Station)లో సిట్ అధికారులు (SIT officials) మరోసారి విచారించారు. 5 గంటల పాటు ప్రణీత్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు హాజరయిన ప్రణీత్ రావు విచారణ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) చేశారు. అప్పటి పోలీసు (Police) ఉన్నతాధికారుల ప్రమేయం ఈ వ్యవహారంలో ఏ మేరకు ఉందనే కోణాల్లో విచారణ కొనసాగినట్లు సమాచారం.