Railway Stations: రైల్వేస్టేషన్లలో భారీగా భద్రత: సీపీఆర్‌వో శ్రీధర్

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) సీపీఆర్‌వో శ్రీధర్ (Sridhar) వెల్లడిరచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్‌లైన సికింద్రాబాద్ (Secunderabad) , కాచిగూడ (Kacheguda )లో భారీగా భద్రతను పెంచినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-పాక్ (India-Pakistan) ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను మూసి వేయడంతో రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని శ్రీధర్ వెల్లడిరచారు.