Saraswati: సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం (Kaleshwaram) లో సరస్వతి నది పుష్కరాలు (Saraswati River Pushkarams) ప్రారంభమయ్యాయి. పుష్కరాలను మాధవానంద సరస్వతి స్వామి (Madhavananda Saraswati Swami) ప్రారంభించారు. పుష్కరిణి వద్ద మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.