Saraswati Pushkaram: ఘనంగా సరస్వతి పుష్కరాలు.. హాజరైన మంత్రి తుమ్మల

కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్ (Pushkar Ghat) లో మూడు రోజుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి (Mukteshwara Swamy)ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) ప్రత్యేక హెలికాప్టర్ (Special helicopter) లో కాళేశ్వరానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుణ్య స్నాం ఆచరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు.