Sabitha Indra Reddy : 12 ఏండ్లుగా ఎన్నో అవమానాలు కానీ.. ఈ రోజు : ఎమ్మెల్యే సబితా

ఓబుళాపురం మైనింగ్ (Mining)కేసులో తనను సీబీఐ కోర్టు (CBI court) నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అనంతరం ఆమె కోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ తనను నిర్దోషిగా ప్రకటించిన న్యాయ వ్యవస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసు విషయంలో పన్నెండున్నరేళ్ల క్రితం కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కానని ఈ సందర్భంగా ఆమె గర్తు చేసుకున్నారు. ఎన్ని అపవాదులు వచ్చినా తన నియోజకవర్గ (constituency) ప్రజలు మాత్రం తనకు అండగా నిలిచారన్నారు. ఏ తప్పూ చేయకపోయినా ఈ కేసులో నన్ను చేర్చడం బాధ పడ్డాను. న్యాయ వ్యవస్థ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని నమ్మాను. ఈ రోజు అదే జరిగింది. కానీ, ఇన్నేళ్లును నేనే పడిన అవమానాలు, ప్రతిపక్షంలో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలినని, జైలుకు పోతానని మాటటు అంటుంటే ఎంతో బాధపడ్డాను. అలా ప్రచారం చేసినా నా జిల్లా ప్రజలు, నియోజకవర్గం ప్రజలు నాపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచారు. ఎవరెన్ని మాట్లాడినా నమ్మకుండా నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఇన్నేళ్లుగా నాతో పాటు ఉండి ధైర్యం చెప్పిన అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.