Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తో రష్యా కాన్సుల్ జనరల్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )తో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో చెన్నై (Chennai)లోని రష్యా కాన్సుల్ జనరల్ వాలెరీ ఖోడ్జాయేవ్ (Valerii Khodzhaev) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా కాన్సుల్ జనరల్ (Russian Consul General)కు సీఎం రేవంత్ రెడ్డి పుష్ప గుచ్చం అందజేసి, శాలువా (Shawl) కప్పి సత్కరించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఇక్కడున్న ప్రపంచస్థాయి మౌలిక వసతులు, నిపుణులైన మానవనరులు, తదితర అంశాలపై రేవంత్ రెడ్డి రష్యా కాన్సుల్ జనరల్‌కు వివరించారు.