BRS: రేవంత్, ఆయన అనుచరులు తప్ప అందరూ వరంగ్‌లోనే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వరంగల్‌లో ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ వేడుకలు విజయవంతం అవుతాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వేడుకలకు సంబంధించి చెన్నూరులో వేసిన గోడ రాతలను మున్సిపల్ అధికారులు తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ (BRS) నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. “కాంగ్రెస్ నాయకులారా, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఏప్రిల్ 27న తెలంగాణ ప్రజలందరూ వరంగల్‌లోనే ఉంటారు. ఆ రోజు రేవంత్ రెడ్డి, ఆయన సహాయకులు మాత్రమే మిగిలిపోతారు. గాంధీ భవన్‌లో మా సభను ప్రత్యక్ష ప్రసారం చూస్తూ మీ సమయాన్ని గడపండి” అని ప్రవీణ్ కుమార్ (Praveen Kumar) ట్వీట్ చేశారు.