Revanth reddy: అల్లు అర్జున్ కాలుపోయిందా…? కన్ను పోయిందా…? నో మోర్ బెనిఫిట్ షోస్

సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ (Revanth reddy)… ఈ మేరకు అసెంబ్లీలో సంచలన కామెంట్స్ చేసారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో 10 వరకు థియేటర్లు ఉన్నాయని… అల్లు అర్జున్(Allu Arjun) రావడంతో పరిస్థితి అదుపుతప్పిందని అతికష్టం మీద హీరోను లోపలికి తీసుకెళ్లారని హీరోను చూసేందుకు వేలసంఖ్యలో జనం వచ్చారు, తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు అంటూ ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసారు సీఎం రేవంత్. అసలు హీరోను అంతమంది పరామర్శించడానికి కారణం ఏంటి అని నిలదీశారు.
ఆస్పత్రిలో బాలుడు చావు బతుకుల్లో ఉంటే కనీసం ఏ ఒక్కరు వెళ్ళలేదు అని ఒక్క హీరో జైల్లో ఉంటే సినిమా పరిశ్రమ మొత్తం వెళ్లిందని… అసలు అతని కాలు పోయిందా కన్ను పోయిందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవి చూస్తుంటే సినిమా పరిశ్రమ ఏం కోరుకుంటుందో తనకు అర్ధం కావడం లేదన్నారు. అసలు అల్లు అర్జున్ కు అనుమతి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. సంధ్య థియేటర్ కు బయటకు లోపలి ఒక్కటే దారి ఉంది.. హీరో, హీరోయిన్ రావొద్దని చెప్పామన్నారు రేవంత్ రెడ్డి. హీరో కారులో వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే సరిపోయేదన్నారు.
రోడ్డు షో చేసుకుంటూ హీరో వచ్చాడు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగితే పట్టించుకోలేదని మండిపడ్డారు. తొక్కిసలాటలో కన్నబిడ్డను పట్టుకుని తల్లి చనిపోయిందని కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడని… ప్రాణం పోతున్నా తన బిడ్డ ప్రాణం ఆ తల్లి కాపాడాలని అనుకుందని అది తల్లి ప్రేమ అన్నారు రేవంత్ రెడ్డి. నేను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని సిఎం స్పష్టం చేసారు. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగిందన్నారు.
ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదని బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారన్నారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారని వివరించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారని సమాధానాలు కూడా సరిగా చెప్పలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు.