Revanth Reddy: తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? : రేవంత్ రెడ్డి

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు తాము సంపూర్ణంగా సహకరించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన బసవేశ్వర 892 జయంతి (Basaveshwara Jayanti) వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల (Tenth class exam results ) ను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల బీఆర్‌ఎస్ రజతత్సవ వేడుకల్లో (BRS Silver Jubilee Celebration) మాజీ సీఎం కేసీఆర్ (KCR) కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై సీఎం దీటుగా స్పందించారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పథకాలు నిలిపివేసినట్లు కేసీఆర్ చెబుతున్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, ప్రజాపాలన ఆగిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అని మండిపడ్డారు.