Sonata Software: జీసీసీ హబ్‌గా హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి

సాఫ్ట్‌వేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ జీసీసీ హబ్ (GCC Hub )గా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) అన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ (Sonata Software ) సంస్థను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏఐ-రెడీ డేటా సెంటర్లు (AI-Ready Data Centers), తయారీ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు. కొత్తగా రూ.3.లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించినట్లు తెలిపారు. మరిన్ని ప్రపంచస్థాయి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంక్షేమం సమతుల్యంగా సాగుతున్నాయని వివరించారు. ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో అందరి సహకారం కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) , మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) పాల్గొన్నారు.