Revanth Reddy: భారత పౌరుడిగా గర్వంగా ఉంది : సీఎం రేవంత్‌రెడ్డి

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిగా నిలిచి ఐక్యత చాటాల్సిన సమయమిదంటూ జైహింద్ (Jai Hind)అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఢల్లీిలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka ) కు సీఎం ఫోన్ చేశారు. తక్షణమే బయల్దేరి హైదరాబాద్ (Hyderabad) రావాలని సూచించారు.