Revanth Reddy: కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు : రేవంత్ రెడ్డి

ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. కేసీఆర్ (KCR) ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రసంగం అక్కసుతో కూడుకున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి మాపై నిందనలు వేస్తున్నారు. బీఆర్‌ఎస్ (BRS)ను నమ్మే స్థితితో ప్రజలు లేరు. కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారు. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు. రాహుల్‌గాంధీ (Rahul Gandhi), నాకు గ్యాప్ ఉందనడం అవాస్తవం. రాహుల్‌కు, నాకు ఉన్న అనుబంధం ప్రపంచానికి చెప్పనవసరం లేదు. అవసరాలను బట్టి కేసీఆర్, మోదీ మాటలు మారుస్తున్నారు. దేశానికి ఇందిరాగాంధీ (Indira Gandhi) లాంటి ప్రధాని కావాలి అని అన్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లాలి. ఎమ్మెల్యేలు వెళ్తేనే ప్రజల్లోకి పథకాలు వెళ్తాయి. పార్టీలో ఓపికగా ఉంటే పదువులు వస్తాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారు అని హెచ్చరించారు.